డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు?

-

డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై నిపుణుల సలహా తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ చెల్లింపును ప్రజా ప్రయోజనంగా చూస్తున్నామని, దీంతో భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజేషన్ చేయవచ్చన్నారు.

నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్

డిజిటలైజేషన్ ద్వారా పారదర్శక చెల్లింపులు జరుగుతాయని, అందుకోసం డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయడానికి ఇది సరైన సమయం కాదని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. డిజిటల్ లావాదేవీలు, ఈజీ ట్రాన్సాక్షన్ వైపు కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే లావాదేవీలపై ఛార్జీల విధింపు, చెల్లింపు వ్యవస్థలో వివిధ మార్పులపై ప్రజల నుంచి ఆర్‌బీఐ అభిప్రాయాన్ని కోరుతున్న నేపథ్యంలో మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news