మీ ఇంట్లో అద్దం ఏ దిశలో అమర్చుకోవాలంటే..?

-

ఇంట్లో కొన్ని వస్తువులు వాస్తు ప్రకారమే అలంకరించుకోవాలని వాస్తు పండితులు చెబుతుంటారు. లేకపోతే ఇంట్లో అశాంతి, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు తాండవం చేస్తాయని అంటుంటారు. ప్రతి ఇంట్లో అద్దం తప్పకుండా ఉంటుంది. అయితే కొందరు పగిలిపోయిన అద్దాలను కూడా ఇంట్లోనే ఉంచుతారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని అంటుంటారు. అదే విధంగా అద్దం ఏ సైజులో ఉంటే మంచిది..? ఇంట్లో ఏ దిశలో అద్దం అమర్చుకోవాలో తెలుసా..?

Vastu Shastra tips for placing mirrors at home and office | Housing News

అద్దం లేని ఇల్లు ఉండదు. కొందరు వెరైటీ డిజైన్లు, పెద్దపెద్ద అద్దాలు ఏర్పాటు చేసుకుంటారు తమ ఇళ్లలో. అద్దంలో చూసుకుంటూ మురిసిపోని వారుండరు. ముఖ్యంగా ఆడవాళ్లకు అద్దానికి ఉన్న బంధం విడదీయలేనిది. రోజులో ఎన్ని గంటలైనా వాళ్లు అద్దం ముందు ఉండగలరు. అందుకే ఇళ్లలో పెద్దపెద్ద అద్దాలను అందమైన డిజైన్లలో ఉండే అద్దాలను ఉంచడానికి ఇష్టపడతారు.

అద్దం ఏ దిశలో ఉండాలంటే.. మీ ఇంట్లో నైరుతి దిశలో బాత్రూమ్ లేదా టాయిలెట్ ఉంటే.. అప్పుడు అద్దాన్ని తూర్పు దిశలోని గోడకు పెట్టుకోవాలి. ఆ అద్దం కూడా చదరపు ఆకారంలోనే ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఇంటి నిర్మాణంలో ఏదైనా భాగం అసాధారణ ఆకారంలో లేదా చీకటిగా  ఉంటే.. అలాంటి ప్రాంతంలో అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అద్దం ఉంచడం ద్వారా శక్తిని సమతుల్యం చేసుకోవచ్చని వాస్తు పండితులు అంటున్నారు.

మీ ఇంటి బయట  విద్యుత్ స్తంభాలు, ఎత్తైన భవనాలు,  భారీ చెట్లు లేదా పదునైన చెట్ల భాగాలు ఉంటే అప్పుడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఏర్పాటు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆ అద్దం అష్టభుజి ఆకారంలో ఉండేలా చక్కని ఫ్రేమ్​తో ఉండేలా చూసుకోమంటున్నారు. ఈ ఫ్రేమ్​లు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, బంగారం రంగులో ఉండాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news