బాలీవుడ్‌లో బెల్లంకొండకు లైన్‌ క్లియర్.. ‘ఛత్రపతి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఛత్రపతి మూవీ రీమేక్‌తో ఈ యువ హీరో హిందీ ప్రేక్షకులను త్వరలోనే అలరించేందుకు రెడీ అయ్యాడు. వి.వి.వినాయక్‌ ఈ సినిమాకు దర్శకుడు. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ నిర్మిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఘనవిజయం సాధించిన ‘ఛత్రపతి’ రీమేక్‌ ఇది. బాలీవుడ్‌లో ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు.

‘ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అసాంఘిక శక్తులపై ఆయన సాగించిన సమరం ఏమిటన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. సాహిల్‌ వైద్‌, అమిత్‌ నాయర్‌, రాజేంద్రగుప్తా, శివం పాటిల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : విజయేంద్రప్రసాద్‌, కెమెరా: నిజార్‌ అలీ షఫీ, సంభాషణలు: మయూర్‌ పూరి, సంగీతం: తనిష్క్‌ బాగ్చి, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news