వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం మొహలీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్.. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నట్లు ఈ క్రమంలో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన తండ్రి ఒత్తిడి వలన ఆ పరీక్ష చేసుకున్నట్లు తెలిపాడు.
14-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా కుటుంబంతో కలిసి మనాలీ సందర్శనకు వెళ్లాం. అప్పుడు నా కుటుంబానికి తెలియకుండా నా వీపుపై ఓ టాటూ వేయించుకున్నాను. అది కనిపించకుండా జాగ్రత్త పడ్డా. 3 నుంచి 4 నెలల వరకు టాటూ దాచి ఉంచా. ఒక రోజు మా నాన్నకి తెలిసిపోయింది. తర్వాత, మా నాన్న మందలించాడు. టాటూ వేసే వ్యక్తి ఏ సూదీతో వేసి ఉంటాడోనని వెళ్లి హెచ్ఐవీ వైరస్ పరీక్ష చేయించుకున్నా. అదృష్టవశాత్తు నెగిటివ్ తేలింది’ అని ధావన్ తెలిపాడు.