వైసీపీ మాజీ ఎమ్మెల్యే: జగన్ టికెట్ ఇవ్వకున్నా… ఇండిపెండెంట్ గా గెలుస్తా !

-

ఈ మధ్యన ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చిన మాట వాస్తవం. అంతమాత్రాన ఈ ఫలితాలు రాబోయే ఎన్నికలను ప్రభావితం చేస్తాయి అనుకోవడం మాత్రం అవివేకం అవుతుంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందడం.. అది కూడా ఆనం రామనారాయణ రెడ్డి మరియు కోటంరెడ్డి సిద్దర్ రెడ్డి లు కాకుండా మరో ఇద్దరు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతోనే ఆమె గెలిచింది అన్నది తెలిసిందే.

అయితే అప్పాయుడే వైసీపీ అధిష్టానం క్రాస్ వోటింగ్ చేసింది నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరియు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అని బలంగా నమ్మి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. దీనితో వీరిద్దరూ పార్టీకి రెబల్ గా కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాకు వచ్చే ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వనన్నాడని, నాపై వైసీపీ నాయకులలో వ్యతిరేకత ఉన్నా ప్రజల్లో అభిమానం ఉందని… వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news