NTR Koratala: అల్లుఅర్జున్ నో అంటే… ఎన్టీఆర్ ఎస్ అన్నాడ‌ట‌!

-

NTR Koratala: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ‌ల్టీ స్టార‌ర్లుగా దర్శక దిగ్గ‌జం రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను వ‌చ్చే జనవరి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాల‌ని ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు జక్కన్న.

 

ఇదిలా ఉంటే.. తారక్ త‌న త‌రువాత సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయ‌డానికి సిద్దంగా ఉన్నాడ‌ట‌. వీరిద్ద‌రి కాంబో వ‌చ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించి విష‌యం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వ‌స్తుంద‌టంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలున్నాయి.

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్‌ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభ కానున్న‌ది. ఇదిలా ఉంటే తాజాగా ఇంట్రెస్టింగ్‌ వార్త ఒకటి వైరల్‌ అవుతోంది.

ఇండస్ట్రీలో మామూలుగా ఒక హీరో ఒక చేయవలసిన కథను మరో హీరో చేస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో సార్లు జరిగింది. అయితే తాజాగా అల్లు అర్జున్ కోసం అనుకున్న కథని ఎన్టీఆర్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే నిజానికి సినిమా క‌థ‌ను మొదట అల్లు అర్జున్ కోసం రెడీ చేశాడట కొరటాల. కానీ బన్నీ ఆ కథను రిజెక్ట్ చేశాడ‌ట‌. దీంతో కొరటాల శివ.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్కు వినిపించ‌డంతో.. ఈ క‌థ న‌చ్చడంతో ఆయ ఓకే చెప్పాడ‌ట‌. అల్లు అర్జున్ కాదనుకున్న ఈ స్టోరీ తో ఎన్టీఆర్ ఏ మేర అక్కటుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news