వేసవిలో చెమట సమస్యకు ఈ టిప్స్ తో చెక్ పెట్టండి..

-

ఎండాకాలంలో సూర్యుడు తాపానికి, వేడికి చెమట ఎక్కువగా కారడం, శరీరం నుంచి దుర్వాసన రావడం మనం చూస్తూనే ఉంటాం..ఎండలో కాసేపు బయటికి వెళితే శరీరం చెమటలు పట్టి బట్టలన్నీ తడిసిపోతున్నాయి.. ఈ చెమట కారణంగా శరీరం జిడ్డుగా మారిపోతోంది. అంతేకాకుండా, ఈ చెమట శరీర దుర్వాసనను కలిగిస్తుంది. వేసవిలో అందరూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఇది. ఎండ వేడిమికి ఇంట్లో ఉండి కూడా చెమటలు కక్కుతూ, తడిసి ముద్దవుతున్నాం. వేసవిలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అధిక చెమట సమస్యను నివారించడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం..

. చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మరి కొందరైతే రోజుకు 4 నుంచి 5 సార్లు కాఫీ తాగేవారు. ఈ కెఫిన్ అడ్రినల్ గ్రంధులను ప్రేరేపిస్తుంది. దీని వల్ల మన అరచేతులు, పాదాలు, అండర్ ఆర్మ్స్‌లో విపరీతమైన చెమట పట్టేలా చేస్తుంది. అందుకే కెఫీన్ తీసుకోవడం వీలైనంత తగ్గించాలని డైటీషియన్లు సలహా ఇస్తున్నారు..

. మనం తినే ఆహారంలో ఎక్కువ మసాలాలు లేదా ఉప్పును వేయకూడదు. సాల్ట్ ఫుడ్ తీసుకుంటే శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. అందుకే వేసవిలో వీలైనంత వరకు కారం, ఉప్పగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది..

. శరీరం చెమట ద్వారా కోల్పోయే నీటిని తిరిగి నింపడానికి నీరు ఎక్కువగా తాగడం మంచిది. వేసవి కాలంలో మజ్జిగ, పండ్ల రసాలను త్రాగాలి. పోషకాహార నిపుణులు ప్రకారం, ఇలా చేయడం వల్ల మన శరీరం చల్లగా ఉంటుంది..

. యాంటీపెర్స్పిరెంట్ స్ప్రేలు చెమటను తగ్గించడంలో సహాయపడుతాయి. చెమట దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ స్ప్రేని ఉపయోగించొచ్చు.

. మనం ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు మన శరీరంలోని చెమట గ్రంథులు సక్రియం అవుతాయి. ఇది శరీరంలో అధిక చెమటకు దారితీస్తుంది. అందుకే విపరీతమైన చెమట పట్టకుండా ఉండేందుకు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలి.. వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అస్సలు మర్చిపోకండి..

Read more RELATED
Recommended to you

Latest news