తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ రాజకీయాలపై బాగా ఫోకస్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తునే.. విపక్షాలను ఏకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.
ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవగౌడ కుమారస్వామి తో చర్చించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కేసీఆర్, కుమారస్వామి భేటీ కానున్నారు. జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్, ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. భాజాపాను గద్దె దించేందుకు కలిసి రావాలని వివిధ పార్టీల నేతలను కోరారు.