ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గంలో జరగబోయే మార్పులు చేర్పుల గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సమర్థవంతమైన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారు ఏంటనేది క్లారిటీ లేకపోయినా ఆర్థిక శాఖ, రెవిన్యూ, అలాగే పట్టణాభివృద్ధి శాఖల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు.
అలాగే పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ అయిన పర్యాటకరంగం విషయంలో కూడా జగన్ సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే హోంశాఖ విషయంలో కూడా జగన్ కాస్త సీరియస్ గానే ఉన్నారు. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత సమర్ధవంతంగా పని చేస్తున్నారు. అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే పర్యాటక శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి కూడా కనబడలేదు.
పర్యాటక రంగం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ ఈ శాఖ మీద ఎక్కువగా దృష్టి సారించాలి అని భావిస్తున్నారు. ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా ఉంటుంది. అలాగే జలవనరుల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం. కాబట్టి ఈ శాఖలలో మంత్రుల పనితీరు విషయంలో జగన్ ఒకసారి సమీక్ష చేసి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ శాఖల్లో మార్పు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టాలి అని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.