నాకు రాజకీయా నాయకులు, సినీ తారలతో పరిచయాలు ఉన్నాయి – చీకోటి

-

నాకు చాలామంది రాజకీయ నాయకుల తో సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చీకోటి ప్రవీణ్‌ పేర్కొన్నారు. పని గట్టుకొని కొంతమంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈడీ విచారణ పూర్తి అయినా తర్వాత అన్ని వివరాలు వెళ్లాడిస్తానని చెప్పారు చీకోటి. చికోటి ప్రవీణ్ నాలుగో రోజు ఈడీ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా చీకోటి మాట్లాడుతూ… విచారణ కొనసాగుతుంది ఈడి అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను…విచారణ అంతా పూర్తి అయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.

నాపై పనిగట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని… సోషల్ మీడియాలో నా పేరుతో ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఇప్పటికే ఇదే విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని.. నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని హైకోర్టు లో రిట్ పిటిషన్ వేసానని వెల్లడించారు. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని.. ఇక పై కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. క్యాసినో బిజినెస్ చేసాను..అందులో తప్పేముందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news