BREAKING : హైకోర్టును ఆశ్రయించిన చికోటి..2+2 గన్ మెన్ కావాలంటూ !

-

BREAKING : చికోటి ప్రవీణ్ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు చికోటి ప్రవీణ్. తన ప్రాణానికి రక్షణ కోరుతూ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు చికోటి ప్రవీణ్. 2+2 గన్ మెన్ ల రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు చికోటి ప్రవీణ్. ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించారు చికోటి అనుచరులు.

ఈ మేరకు ఇప్పటికే సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చికోటి ప్రవీణ్ న్యాయవాది. చికోటి ప్రవీణ్ ఇంటి ముందు భారీగా అనుచరుల మోహరించారు. చికోటి ప్రవీణ్ ను చంపేందుకు తెర వెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయిని ఆరోపిస్తున్నాయని చికోటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2+2 గన్ మెన్ ల రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు చికోటి ప్రవీణ్. కాగా.. ప్రస్తుతం చికోటి ప్రవీణ్‌ కేసీనో వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలు, టాలీవుడ్‌ పరిశ్రమను షేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news