‘అరుణాచల్ ​ప్రదేశ్​ మాదే అందుకే కొత్త పేర్లు’.. చైనా కొత్తరాగం

-

అరుణాచల్ ​ప్రదేశ్​పై చైనా మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టింది. అరుణాచల్ ​ప్రదేశ్​.. చైనాలో అంతర్భాగమని పేర్కొంది. తమ భూభాగంలోనే అరుణాచల్​ ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. అందుకే అరుణాచల్​లోని 11 ప్రదేశాలకు చైనా కొత్త పేర్లు పెట్టిందని చెప్పారు.

‘జాంగ్నాన్ (అరుణాచల్ ప్రదేశ్) చైనా భూభాగంలో ఉంది. జాంగ్నాన్​పై సార్వభౌమాధికారం చైనాదే. స్టేట్ కౌన్సిల్ భౌగోళిక నిబంధనల ప్రకారమే అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టాం.’ అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.

భారత్​లోని అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రదేశాలకు చైనా పేర్లు మార్చడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయంతో భారత్​కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. అరుణాచల్ ​ప్రదేశ్​లో భారత్​లో అంతర్భాగమని అమెరికా​ గుర్తించిందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news