కరోనా వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనాలో దాని గురించి ఇంకా వాస్తవాలు బయటకు రావడం లేదు. అక్కడ కేసులు ఇప్పుడు నమోదు అవుతున్నా సరే చైనా ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తుంది. తాజాగా చైనాలో కరోనా వైరస్ బారిన పది వేల మంది వరకు పడ్డారని సమాచారం. ఊహాన్ లో లాక్ డౌన్ ని ఎత్తివేసి ఆ దేశం పెద్ద తప్పు చేసిందని ఇక అక్కడి నుంచి కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు.
హుబే ప్రావిన్స్ లో ఉన్న కొన్ని గ్రామాల్లో కేసులు భారీగా ఉన్నాయని అక్కడ కేసులు అదుపులోకి రాకుండా చైనా లాక్ డౌన్ ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారని అంటున్నారు. ఇక ఇప్పుడు రష్యా సరిహద్దుల నుంచి భారీగా వచ్చిన వాళ్ళు అందరికి కరోనా ఉందని చైనా సర్కార్ గుర్తించింది. అక్కడ గత 20 రోజుల్లో వెయ్యి మంది వరకు మరణించినా లెక్కలు చెప్పడం లేదు.
అక్కడ మరణాల సంఖ్య పెరుగుతున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థకు వాస్తవాలు అందుతున్నా ప్రకటన మాత్రం రావడం లేదు. చైనా ధైర్యంగా ఉందని కరోనా రాదని భావిస్తుంది అన్న వాళ్ళే ఇప్పుడు ఆ దేశం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఊహాన్ లో 50 శాతం మరణాలు పెరిగాయి. ఇంత జరుగుతున్నా చైనా మాత్రం వాస్తవాలు బయటకు తీయడం లేదని అంటున్నారు. జర్నలిస్టులను ఆ దేశం చంపేస్తుందని సమాచారం.
శుక్రవారం కొత్తగా 325 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 82692కి చేరింది. అలాగే… కొత్తగా 1290 మరణాలు తెలుస్తుంది. మొత్తం మరణాల సంఖ్య 4632కి చేరింది.