అట్టర్ ప్లాప్ దిశగా చీరాల ఎమ్మెల్యే గ్రాఫ్ ???

-

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చీరాల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి కరణం బలరాం గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు ఎప్పటినుండో పార్టీకి విధేయుడుగా ఉండటంతో చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలలో జగన్ భారీ మెజార్టీతో గెలవడం తో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీలో చేరకపోయినా గాని కరణం బలరాం…జగన్ జపం చేస్తున్నారు.Image result for karanam balaramఈ తరుణంలో ఆయన తనయుడు కరణం వెంకటేష్ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. దీంతో సొంత కొడుకు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడంతో కరణం బలరాం ఎమ్మెల్యే గ్రాఫ్ అట్టర్ ఫ్లాప్ దిశగా తెలుగుదేశం పార్టీలో రన్ అవుతోంది. దశాబ్దాల పాటు టీడీపీలో కీలకంగా ఉన్న కరణం బలరాంకు కేవలం ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఫాలోయింగ్ ఉంది. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రతి టీడీపీ కార్యకర్త ఆయన్ని అభిమానిస్తారు.

 

ఇలా టీడీపీలో ఎనలేని అభిమానం సంపాదించుకున్న కరణం, వైసీపీ వైపు వెళ్ళడం వల్ల ఒక్కసారిగా ఆ అభిమానాన్ని కోల్పోయారు. మరోపక్క చీరాల లో ఉన్న నిజమైన వైసీపీ పార్టీ కార్యకర్తలు…కరణం ఫ్యామిలీ కంటే ఆమంచి కృష్ణమోహన్ కి ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికలలో కరణం కనుసన్నల్లో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరగటంతో…కరణం వెంకటేష్ పార్టీలో రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చీరాల వైసీపీ క్యాడర్. 

 

Read more RELATED
Recommended to you

Latest news