Chiranjeevi: మెగా హీరోల‌తో శ్రీకాంత్‌ అడ్డాల మల్టీస్టారర్‌?

-

Chiranjeevi: గత కొంతకాలంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ న‌డుస్తుంది. ఆయ‌న సినిమాల‌నే ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తి చూపుతున్నారు. ఒక స్టార్ హీరో.. మరో కథానాయకుడితో నటించడానికి సై అంటున్నారు. అందులో ఒకే ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ మూవీస్ చాలా క్రేజ్ ఉంది. ఇప్పటికే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి ఫ్యామిలీ హీరోలు మల్టీస్టారర్ మూవీస్ చేసారు.

తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించబోతున్నారు.
తాజాగా మ‌రో మ‌ల్టీస్టారర్ మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అగ్ర‌హీరోలు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇంత‌కీ ఆ మ‌ల్టీస్టార‌ర్ మూవీ న‌టించ‌బోయే హీరోలెవ‌రో తెలుసా..? వారే.. మెగాస్టార్‌చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ చిత్రాన్ని శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

తాజాగా శ్రీ‌కాంత్‌ అడ్డాల చిరుకు కథ వినిపించారట. చిరు కూడా సానుకూలంగా స్పందించారని టాక్. త్వ‌ర‌లోనే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయన్నారని సమాచారం. అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టులో తెర‌కెక్క‌బోతుంది. గతంలో చిరు
నటించిన ‘డాడీ’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చిత్రాల్లో అల్లు అర్జున్ న‌టించిన విష‌యం తెలిసిందే . ఈ ప్రాజెక్టు మీద మ‌రింత క్లార‌టీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

 

Read more RELATED
Recommended to you

Latest news