ఇప్పటివరకు సంక్రాంతి బరిలో పోటీపడిన చిరు, బాలయ్య చిత్రాలు ఇవే..!

-

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ చిత్రాలు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి అయితే వీరిద్దరూ ఇంతకుముందు సంక్రాంతి బరిలో ఎన్నోసార్లు పోటీపడ్డారు అయితే ఆ చిత్రాలు ఏంటంటే..

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రాలు అభిమానుల ముందుకి రాబోతున్నాయి అయితే చాలాకాలం తర్వాత మళ్లీ వీరిద్దరు సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి అయితే గతంలో పలుమార్లు మీరు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి విడుదలయ్యి సందడి చేశాయి ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు మంచి హిట్ టాక్ అందుకున్నాయి..

2023లో చిరు బాలయ్య సినిమాలు12న వీరసింహారెడ్డి.. 13కి వాల్తేరు వీరయ్య సినిమాలో అభిమానులు ముందుకి రాబోతున్నాయి అలాగే 1985లో చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం బాలయ్య నటించిన ఆత్మబలం సినిమాలు ఆ ఏడాది ఒకేరోజు విడుదలై సందడి చేశాయి..

అలాగే 1987 జనవరి 9న చిరంజీవి దొంగ మొగుడు సినిమా బాలకృష్ణ భార్గవ రాముడు సినిమా జనవరి 14న ప్రేక్షకులు ముందుకి వచ్చాయి అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు..

అలాగే మరుసటి ఏడాది 1988లో జనవరి 14న చిరంజీవి నటించిన మంచి దొంగ సినిమా ప్రేక్షకులు ముందుకి రాగా జనవరి 15న బాలకృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా విడుదలైంది..

అలాగే 1997లో జనవరి 4న చిరంజీవి హిట్లర్ సినిమా విడుదల కాగా జనవరి 10న బాలయ్య పెద్దన్నయ్య చిత్రం విడుదలైంది.. ఈ రెండు సినిమాలు అప్పట్లో మంచి టాక్ తెచ్చుకున్నాయి..

అలాగే 1999లో జనవరి 1న చిరంజీవి స్నేహం కోసం సినిమా విడుదల కాగా బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమా జనవరి 13న విడుదలైంది..

అలాగే మలసిటి ఏడాది 2000లో చిరంజీవి నటించిన అన్నయ్య సినిమా విడుదల కాగా బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు విడుదలైంది… ఈ రెండు సినిమాలు వారం రోజుల తేడాతో సందడి చేశాయి..

అలాగే 2001లో చిరంజీవి నటించిన మృగరాజు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సంక్రాంతికి విడుదలైంది..

అలాగే 2004లో చిరంజీవి కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించిన అంజి సినిమా విడుదల కాగా బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ కూడా సంక్రాంతికి విడుదలైంది..

అలాగే మళ్ళీ చాలాకాలం గ్యాప్ తీసుకున్నా చిరంజీవి 2017లో ఖైదీ 150 సినిమాతో సంక్రాంతి బరిలో నిలవగా బాలకృష్ణ తన వందల చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో అభిమానులు ముందుకి వచ్చారు..

Read more RELATED
Recommended to you

Latest news