పవన్ కళ్యాణ్ గన్స్ చూసి నక్సలైట్ అయిపోతాడేమో అని భయపడ్డా.. చిరంజీవి..

-

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ గాయని స్మిత పోస్ట్ చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షో కి వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో విషయాలు చెప్పకు వచ్చారు అలాగే ఒకానొక సమయంలో పవన్ నక్సలైట్ అయిపోతాడేమో అని భయం కూడా వేసిందంటూ తెలిపారు..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నిజం విత్ స్మిత టాక్ షోలో పవన్ కళ్యాణ్ కోసం పలు ఆసక్తికర విషయాలు చెప్పకు వచ్చారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఏదో చేయాలని ఆలోచన బాధల్లో ఉన్నవారిని చూసి పవన్ స్పందించే తీరు చూసి నిజం లోకి వెళ్లిపోతాడేమో అని భయపడ్డాను అంటూ తెలిపారు అలాగే ఈ షోలో స్మిత మెగాస్టార్ ను.. “పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే సినీ నటుడిగా ఏదంటే మీకు ఇష్టం.. ” అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి “పవన్ కళ్యాణ్‌ సహజత్వంగా, తన నేచర్‌ను బట్టి అయితే అతను ఏదో ఒక రోజు కచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. బాధలకు స్పందించే తీరు, ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచీ ఉంది.

దాని కోసమే ఒకానొక సమయంలో నక్సల్స్‌లోకి వెళ్లిపోతాడేమోనని భయమేసింది. గన్‌లతో ఎక్కువగా ఆడేవాడు. నేను షూటింగ్‌లకు సింగపూర్ వెళ్తే.. అన్నయ్య అక్కడ గన్స్ దొరకుతాయి, ఇక్కడ దొరకట్లేదు తీసుకురా అనేవాడు. అవీ డమ్మీ గన్సే కానీ.. సెమీ ఆటోమేటిక్. అలా గన్‌లతో తిరుగుతుంటే ఒకసారి రైల్వే స్టేషన్‌లో ఆపేశారు. డమ్మీ గన్ అని తెలిశాక వదిలారు. అతనికి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అందరితో పోల్చుకుంటే వేరే రకం. వాళ్లని ఫ్యాన్స్ అనకూడదు. కల్ట్ అంతే భక్తులు.. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ తనకు మాత్రం భక్తులు ఉంటారు. కాబట్టి నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన అవసరం అతని ఉంది.. “అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

అలాగే సుష్మిత, రామ్ చరణ్‌తో పవన్ కళ్యాణ్ ఉన్న ఫొటోను స్క్రీన్ మీద చూపించగానే.. ” మేము అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. వాడికి ఆటవిడుపు ఏంటంటే.. వీళ్లిద్దరికీ ఒకరి మీద ఒకరికి చెప్పేసి వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే చూసి పైశాచిక ఆనందం అనుభవిస్తూ ఉండేవాడు. సురేఖ వచ్చి ఏంటి కళ్యాణ్ ఇలా చేస్తున్నావ్ అని అడిగితే.. లేదు వదినా వాళ్లు ఆడుకుంటున్నారు అనేవాడు. ఆట కాదది.. రాక్షస క్రీడ అనేది సురేఖ.. ” అని ఆనాటి జ్ఞాపకాలను ముచ్చటించారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news