మోకాళ్లు, కీళ్ల నొప్పులతో అడుగు వేయలేకపోతున్నారా..? ఆయుర్వేద చిట్కాలు ఇవే..!!

-

వయసుపెరిగే కొద్ది రోగాలు క్యూ కడతాయి.. పెద్ద వాళ్లకు కామన్‌గా వచ్చే సమస్య మోకాళ్ల నొప్పులు.. మోకాళ్లో గుజ్జు అరిగిపోయింది.. నాలుగు అడుగులు కూడా వేయలేకపోతున్నారు అని అందరూ అనే మాట..! రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, భుజాలు.. ఇలా కీళ్లు ఉండే చోటల్లా నొప్పిగా ఉంటుంది. ప్రతి రోజూ క్షణ క్షణం ప్రతి కీలులోనూ నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి వాపులకు గురై ఎర్రగా మారి నొప్పి మరీ ఎక్కువ అవుతుంది. అడుగు వేసి తీస్తున్నప్పడల్లా ఎంతో బాధ కలుగుతుంది. కూర్చుంటే లేచేందుకు పది నిమిషాలు పడుతుంది.ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఆయుర్వేదం ద్వారా ఎలా తగ్గించుకోవాలో ఈరోజు చూద్దాం..కీళ్ల నొప్పులు నడి వయస్సు వారికి వస్తుంటాయి. వృద్ధాప్యంలో మరింత ఎక్కువవుతాయి. మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంటుంది.
బహిష్టు ఆగిపోయిన స్త్రీలలో, బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలలో ఈ నొప్పులు ఎక్కువగా ఉంటాయి.. సన్నగా ఉన్నవారిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే ఈ సమస్య వస్తుంటుంది. గుండె జబ్బులు ఉన్నవారికి కీళ్ల నొప్పుల సమస్య ఉంటే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి.జీర్ణం కాకుండా శరీరంలో పదార్థాలు వ్యర్థాలుగా మిగిలిపోతే అవి విష పదార్థాలుగా మారుతాయి. అవి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా శరీరమంతటా వ్యాపిస్తాయి. కీళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో కూడా చేరుతాయి. ఆ భాగం శిథిలమవుతుంది. చీములాంటి పదార్థం తయారవుతుంది. కీళ్ల కదలికలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో సంధి వాతం వస్తుంది.కీళ్లు అంటే రెండు ఎముకల చివర్లు కలిసే చోటు. ఒక్కోసారి మూడు ఎముకల చివర్లు కూడా కలుస్తాయి. ఎముకల చివర్లు పలుచని సున్నితమైన పొరచే కప్పబడి ఉంటాయి. దీంతో ఒకదానికొకటి రాచుకోకుండా చక్కగా కదులుతాయి. కీలు పొరంతా సైనోవియమ్‌ అనే ధాతువుతో ఆవరింపబడి ఉంటుంది.
ఇది నూనె లాంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. దాన్నే సైనోవియల్‌ ఫ్లుయిడ్‌ అంటారు. ఈ నూనె లాంటి ద్రవం కీళ్లని కాపాడుతుంది. కదలికలు సరిగ్గా ఉండేలా చూస్తుంది. కానీ ఈ వ్యాధిలో మనలో ఉండే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో వ్యాధి తీవ్రతరం అవుతుంది.పాలు, చేపలు కలిపి తినడం, అజీర్ణంగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం, అజీర్ణంగా ఉన్నప్పుడు చల్లని నీటిలో ఈదడం, ఆకలి లేనప్పుడు అధికంగా తినడం వంటివి ఆమ వాతానికి కారణం అవుతుంటాయి. ఆయుర్వేదంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు చికిత్స ఉంది. ఆమపాచక అంటే విష పదార్థాలను నిర్మూలించడం, జీర్ణశక్తిని మెరుగు పరచడం, ఉపవాసం, విరేచనం, చెమట పట్టించడం, వస్తి అనే క్రియల ద్వారా శరీరాన్ని శుభ్ర పరచాలి. తరువాత కీళ్లలో ఉండే చెడును బయటకు పంపాలి. దీంతో నొప్పిని తగ్గించవచ్చు. చలికాలం, వర్షాకాలంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నొప్పులు అధికంగా ఉంటాయి.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదంలో చికిత్స..

ఉడికించిన కూరగాయలు, క్యారెట్‌, అల్లం, ఉల్లిపాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మకాయ, మామిడికాయ, బొప్పాయి పండ్లను తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రాస్నాక్వాదం, దశమూల క్వాదం, సత్యాది చూర్ణం, శతపుత్వాది చూర్ణం, వాతహర గుగ్గులు, శివగుగ్గులు వాడుకోవచ్చు. ఈ పేర్లేంట్రా వెరైటీగా ఉన్నాయి.. అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయి అని మీకు డౌట్‌ రావొచ్చు. సర్జికల్‌ షాపుల్లో మీకు అన్నీ దొరుకుతాయి.
వేడి నువ్వుల నూనెలో రెండు వెల్లుల్లి పాయలు వేసి కాచిన నూనెతో కీళ్లకు పెట్టుకోవాలి. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి.
వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణం వేసి కలిపి వేడి చేసి పైన మర్దనా చేయాలి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
చేదు పుచ్చ వేరు, పిప్పళ్లు 100 గ్రాములు, బెల్లం 200 గ్రాములు కలిపి నూరి చిన్న మాత్రలు చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే కీళ్ల నొప్పులు 10 రోజుల్లో తగ్గుతాయి. అయితే ఈ మాత్రల వల్ల విరేచనాలు అవుతాయి. కనుక ఆహారం పత్యం పాటించడం మేలు.
గోరు వెచ్చని పాలలో పది చుక్కల వెల్లుల్లి రసం కలిపి ఉదయం తీసుకోవాలి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
శొంఠి చూర్ణం 100 గ్రాములు, నెయ్యి 100 గ్రాములు, వెల్లుల్లి 100 గ్రాములు కలిపి నూరి అందులో 100 గ్రాముల తేనె కలిపి నూరి చిన్న ఉసిరికాయంత మాత్రలు చేసుకుని ఉదయం, సాయంత్రం నీటితో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, దాల్చి్న చెక్క, కుంకుమ పువ్వు. వీటిని ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని కలిపి పొడి చేసి అందులో శొంఠి చూర్ణం 100 గ్రాములు కలిపి తేనెతో నూరి శనగ గింజంత మాత్రలు చేసుకుని, మంచినీళ్ల అనుపానంతో ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే 40 రోజుల్లో నొప్పులు తగ్గుతాయట.

ఈ జాగ్రత్తలు కూడా..

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు పాత బియ్యంతో వండిన అన్నం తినాలి.
మునగ, కాకర కాయలు తినాలి.
వేడి నీళ్లతోనే స్నానం చేయాలి.
పులుపు లేని మజ్జిగ, చేదు, వగరు రుచులు కలిగిన పదార్థాలను తీసుకోవాలి.
వంటల్లో అల్లం, పసుపు, శొంఠి, వెల్లుల్లి వాడుకోవాలి.
అల్లం, జీలకర్రతో చేసే పెసరట్టు, గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవాలి. పెరుగు, పాలు, బెల్లం, మినుములు, చల్లని నీళ్లు, వంకాయ, వేరుశెనగ నూనె, శనగ పిండితో చేసిన పదార్థాలను తినరాదు.
మలమూత్రాలు వచ్చినప్పుడు ఆపుకోకూడదు. రాత్రుళ్లు త్వరగా నిద్రించాలి.
ఎక్కువ సేపు మేల్కొని ఉండరాదు.

Read more RELATED
Recommended to you

Latest news