ద్రౌపది ముర్ము కి అభినందనలు తెలిపిన చిరంజీవి

-

అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీ తో గెలిచి విజయ దుందుభి మోగించారు.పలు రాష్ట్రాల్లో కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా క్రాస్‌ ఓటింగ్‌తో ఆమె వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఊహించినదాని కంటే అధిక మెజార్టీతో గెలుపొందారు. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

కాగా ద్రౌపది ముర్ము కి అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి.” భారత దేశానికి నిజమైన చారిత్రాత్మక క్షణం! మొదటి గిరిజన మహిళ అధ్యక్షురాలి ఎన్నిక! హృదయపూర్వక అభినందనలు మేడం ద్రౌపది ముర్ము జీ! మన గొప్ప దేశానికి రాష్ట్రపతి పదవికి మీ ప్రయాణం ప్రతి భారతీయుడికి, మరియు 110 మిలియన్ల గిరిజన జనాభాకు ఎంతో స్ఫూర్తిదాయకం” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news