అన్నయ్య తో సినిమా జీవితాంతం గుర్తుంటుంది.!

-

చిరంజీవి, రవితేజ హీరోలుగా, శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. తాజాగా పూనకాలు లోడింగ్ సాంగ్  ను థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఈ మాస్ పాటను డిసెంబర్ 31 హైదరాబాద్ సంధ్య థియేటర్ లో అభిమానుల మధ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందులో మెగాస్టార్. రవితేజ కలిసి స్టెప్పులేసినట్లుగా ఇటీవల విడుదలైన పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా కోసం అభిమానుల అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ పాట్ గురించి తన ట్విట్టర్ వేదికగా ఆసక్తిరక పోస్ట్ చేశారు రవితేజ. పూనకాలు లోడింగ్ సాంగ్ తన సినీ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ అని.. అలాగే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ ఎప్పటికీ మెమొరబుల్ గా తన జీవితంలో నిలిచిపోతుందంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం మాస్ మాహారాజా చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news