తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి,తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు సినిమాలలో పైట్లకు పాటలకు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకొని బిగ్గర్ దెన్ బచ్చెన్ గా ఇండియాటుడే లో ప్రముఖుడుగా పేరు పొందారు. అలాగే దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమను నడిపించే పెద్ద దిక్కుగా వున్నారు.
రాజకీయాలలో వెళ్ళక ముందు వరకు తన సినీ జీవితం సూపర్ గా సాగింది. ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశాడో అప్పటినుండి తన చరిష్మా కోల్పోవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తొందరగానే గ్రహించి మళ్లీ సినిమా రంగంలో అడుగుపెట్టారు. మళ్లీ ఖైదీ నంబర్ 150 తో తన సత్తా చాటాడు. తర్వాత తన కలల సినిమా అయిన సైరా నరసింహారెడ్డి” లో కష్టపడి పనిచేసిన ఆశించిన విజయం దక్కలేదు.
ప్రస్తుతం చిరు వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ, ఇంకో రెండు సంవత్సరాల వరకు డోకా లేకుండా చూసుకున్నాడు. కాని రాంచరణ్ తో కలిసి నటించిన గత సినిమా ఆచార్య దారుణ పరాజయం పాలయ్యింది. అలాగే రీసెంట్ గా, స్క్రిప్ట్ పరంగా, విడుదల పరంగా ఎన్నో జాగర్తలు తీసుకున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇంకా బ్రేక్ ఈవెన్ కు రాలేదు.దీనితో చిరంజీవి జడ్జిమెంట్,ప్లానింగ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఎక్స్పీరియన్స్ వున్న చిరు పరిస్థితి అలా వుంటే , తమ పరిస్థితి ఏంటని యంగ్ హీరోలు మదన పడుతున్నారట. త్వరలో రాబోయే సినిమాలు అయినా చిరంజీవి కి హిట్ తెస్తాయేమో వేచి చూడాలి.