రేపిస్టు రాజు సూసైడ్ పై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

రేపిస్టు రాజు ఆత్మహత్య పై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన.. కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించు కోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా మరియు పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టిన వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి” అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

Megastar Chiranjeevi resign to MAA

కాగా సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఘట్ కేసర్ వరంగల్ రైల్వే ట్రాక్ పై నిందితుడి మృతదేహం లభించింది.  ఇక ఈ ఘటన కు చెందిన ఫోటోలు వీడియోలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తోపాటు డీజీపీ కి పంపించారు రైల్వే ఉన్నతాధికారులు.. ఫోటోలు, వీడియోలు చూసి రాజు మృతదేహం గా గుర్తించారు అధికారులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం కు తరలించారు.