చిరు “గాడ్ ఫాదర్” హిందీ ట్రైలర్ రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్”. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. దసరా కానుకగా విడుదల కానున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్ ను ముంబైలో రిలీజ్ చేశారు. అక్టోబర్ 5 న భారీ స్థాయిలో విడుదల కానున్న గాడ్ ఫాదర్ తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రంలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో నటించనున్నారు. కొణిదల సురేఖ సమర్పణలో కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news