1999 రిపీట్..వైసీపీ-లక్ష్మీపార్వతి టార్గెట్‌గా..!

-

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జగన్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇక టీడీపీకి వైసీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు…అసలు ఎన్టీఆర్ గురించే మాట్లాడే హక్కు లేదని, తామే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి..గౌరవించామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇదే క్రమంలో ఎన్టీఆర్ గొప్ప అని టీడీపీ, వైఎస్సార్ గొప్ప అని వైసీపీ మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇదిలా ఉండగానే ఈ ఇష్యూపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ…జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు. ఆల్రెడీ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, జిల్లా పెద్దది అని యూనివర్సిటీ చిన్నది అని ఒక అర్ధం లేని లాజిక్ చెప్పారు. ఇక ఎప్పటిలాగానే చంద్రబాబు వెన్నుపోటు…ఎన్టీఆర్‌ని చంపారని లక్ష్మీపార్వతి మాట్లాడుకుంటూ వచ్చారు. సొంత ఫ్యామిలీ వాళ్ళు ఎన్టీఆర్‌ని పట్టించుకోలేదు అని, తానే ఎన్టీఆర్‌ని చూసుకున్నానని చెప్పుకున్నారు.

అయితే అటు వైసీపీ గాని, ఇటు లక్శ్మిపార్వతి గాని పదే పదే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాట్లాడటంపై టీడీపీ గట్టిగా కౌంటర్లు ఇస్తుంది. వైఎస్సార్‌కు వెన్నుపోటు పొడిచింది జగన్ అని, కాంగ్రెస్‌ని మోసం చేశారని, ఇక లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్‌కు ఆ పరిస్తితి వచ్చిందని, ఆమె వల్లే పార్టీ నాశనమయ్యేది అని, అలా కాకుండా బాబు కాపాడరని అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఉంటే ప్రజలు బాబుని ఇప్పటికీ ఆదరించరు కదా అని ప్రశ్నిస్తున్నారు.

చివరికి ఎన్టీఆర్ గద్దె దిగడమే కాదు..ఆయన చనిపోయాక జరిగిన 1999 ఎన్నికల్లో చంద్రబాబుని ప్రజలు ఆదరించారని గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి 180 సీట్లు వచ్చాయని, అలాగే పొత్తులో పోటీ చేసిన బీజేపీకి 12 సీట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇక వెన్నుపోటు అని పొడిచారని బాబుపై నెగిటివ్ ప్రచారం చేసిన వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 91 సీట్లు వచ్చాయని అంటున్నారు.

అలాగే అన్న టీడీపీ పెట్టిన హరికృష్ణకు..ఒక్క సీటు కూడా రాలేదని, ఒకశాతం ఓట్లు వచ్చాయని, అటు ఎన్టీఆర్ టీడీపీ అని పెట్టిన లక్ష్మీపార్వతికి కనీసం ఒక శాతం ఓట్లు కూడా రాలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి పదే పదే వెన్నుపోటు అని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news