‘సోలో బ్రతుకే సో బెటర్’అని ఎంజాయ్ చేస్తోన్నసాయి తేజ్‌కి స్వీట్ షాక్ ఇచ్చాడు చిరంజీవి. ఈ కొన్ని రోజులు నీకు ఇష్టం వచ్చినట్లు సెలబ్రేట్ చేసుకో, తర్వాత ఎలాగూ ఈ రేంజ్‌లో ఎంజాయ్ చెయ్యలేవు. ఇక నీ లైఫ్‌లో బ్యాచిలర్ హుడ్‌కి శుభం కార్డ్ పడే రోజులు వచ్చాయన్నట్లు మెగా స్టేట్మెంట్ ఇచ్చాడు చిరంజీవి.
. ఇప్పటికే లాక్‌డౌన్‌లో రానా, నితిన్ లాంటి బ్యాచిలర్స్ భర్తలుగా మారిపోతే, ఇప్పుడు సాయి తేజ్ కూడా ఈ క్లబ్‌లో చేరిపోతున్నాడు. త్వరలోనే ఈ మెగామేనళ్లుడు పెళ్లి పీటలెక్కబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.ఈరోజు సాయితేజ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అల్లుడిని విష్ చేస్తూ బ్యాచిలర్ లైఫ్‌కి శుభం కార్డ్ పడే టైమ్ వచ్చిందన్నట్లు ట్వీట్ చేశాడు చిరు. అయితే ఈ మధ్యకాలంలోనే సాయి తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెగాస్టార్ కూడా ట్వీట్ చెయ్యడంతో తేజుకి పెళ్లి ఘడియలు వచ్చేశాయని మాట్లాడుకుంటున్నారు సినీజనాలు.
సాయి తేజ్ ఈ గురువారమే 34 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇంకా లేట్ చేస్తే తేజు మరో ప్రభాస్ అయిపోతాడేమో అని భయపడుతోందట మెగాఫ్యామిలీ. అందుకే ఈ హీరోకి పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారట. మరి తేజు నెక్ట్స్ బర్త్‌డే కల్లా భర్త హోదా అందుకుంటాడా.. అల్లు అర్జున్, రామ్ చరణ్ రూట్‌లోనే తేజు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా.. లేక అరేంజ్డ్ మ్యారేజా చేసుకుంటాడా అన్నది ఆసక్తి కరంగా మారింది.