సమంతకు బిగ్‌ షాక్‌..త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌ తో చైతూ పెళ్లి ?

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య- సమంతల వైవాహిక బంధం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా, వారు మళ్లీ కలిస్తే బాగుండని, అసలు వారు విడిపోకుండా ఉండాల్సిందని భావించే వారు చాలా మంది ఉన్నారు. వారిరువురు వివాహ బంధం నుంచి విడిపోయినప్పటికీ ఫ్రెండ్స్ గా కలిసే ఉంటామని ఇన్ స్టా పోస్టులో పేర్కొన్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ.. విడిపోయి సంతోషంగా ఉంటున్నారు. అటు సమంత, ఇటు నాగ్‌ చైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే.. ప్రస్తుతం నాగ్‌ చైతన్య.. ఓ స్టార్‌ హీరోయిన్‌ తో లవ్‌ లో ఉన్నాడని సమాచారం అందుతోంది.

 

ఇప్పటికే వారిద్దరి విషయం నాగార్జునకు కూడా తెలిసిందట. దీనికి నాగ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అటు అఖిల్‌ కు కూడా పెళ్లి సంబంధాలు చూస్తుందట అక్కినేని ఫ్యామిలీ. అన్ని ఒకే అయితే… నాగ్‌ చైతన్య, అఖిల్‌ కు ఇద్దరికి కలిసి..ఒకే సారి పెళ్లి చేయాలని నాగార్జున ప్లాన్‌ చేశాడని సమాచారం అందుతోంది. నిజంగా ఇదే జరిగితే.. సమంత కు షాక్‌ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news