పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేవు…. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ కట్టుకున్నాడు: కిషన్ రెడ్డి

-

తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఎనిమిదేళ్ల నుంచి మోసం చేస్తున్నారని… కానీ కేసీఆర్ మాత్రం నాలుగు నెలల్లో ప్రగతి భవన్ పేరుతో ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మనం పన్నుల రూపంలో కట్టిన పైసలతో ఇంద్ర భవనం కట్టుకున్నాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు పరచడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం తీసుకువచ్చి ఏడాదికి రూ. 5 లక్షలతో వైద్య సహాయం అందిస్తున్నారు. ఏపీలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని.. కానీ ప్రధాని మోదీకి ఎక్కడ పేరు వస్తుందో అని కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కార్డులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదలు ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఉండాలని.. పక్క రాష్ట్రం ఏపీకి 30 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. అయితే తెలంగాణలో పేదల కోసం ఇళ్లు కడితే… కేంద్ర వాటా కింద ఎంత అయినా ఇస్తాం అని చెప్పినా… కేసీఆర్ అమలు చేయడం లేదని.. డబుల్ బెడ్రూంలు ఇస్తామని చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news