వీడియో వైరల్.. బౌండరీ లైన్ వద్ద క్రిస్ గేల్ క్యాచ్..!

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఐపిఎల్ సీజన్‌లో ఆడుతున్న డ్యాషింగ్ బ్యాట్స్‌ మెన్ క్రిస్ గేల్‌ బౌండరీ లైన్ వద్ద ఓ క్యాచ్ పట్టుకుని లైన్ దాటేశాడు.

దీంతో గేల్ వెంటనే బాల్‌ను మైదానంలోకి విసిరి, లోపలికి వచ్చి, దాన్ని పట్టుకున్నాడు. ఈ వీడియోను ఫ్రాంచైజీ, తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ‘దీన్ని సిక్స్ అని అనుకుంటున్నారా?అలా అనుకుంటే, ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇవ్వండి” అని కామెంట్ పెట్టింది.