బ్రేకింగ్; ఇన్ సైడర్ ట్రేడింగ్ పై రంగంలోకి దిగిన జగన్, నాలుగు బృందాలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిలో తెలుగుదేశం నేతలు భూములు కొన్నారని ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో దూకుడు పెంచింది. బుధవారం శాసన సభలో దీనిపై హోం మంత్రి సుచరిత తీర్మానం ప్రవేశ పెట్టగా అది ఆమోదం కూడా పొందిన సంగతి తెలిసిందే. దీనితో విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది.

దీనిపై సిఐడి విచారణకు దిగింది. నాలుగు బృందాలను జగన్ సర్కార్ నియమించిన నేపధ్యంలో ఎకరం మూడు కోట్లతో రాజధాని ప్రాంతంలో భూములు కొన్న తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్లపై కేసులు నమోదు చేసింది. దాదాపు 796 మందిపై కేసులు నమోదు చేసారు. మొత్తం వాళ్ళు 761 ఎకరాలు కొన్నట్టు గుర్తించారు. ఇప్పుడు వారి ద్వారా భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కేసుని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సహా పలువురిపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. వీరు అందరూ కూడా అమరావతిలో భారీగా భూములు కొనుగోలు చేసారని ప్రభుత్వం కూడా ఆరోపించింది. అయితే పయ్యావుల కూడా ప్రభుత్వానికి సవాల్ చేసారు. తాను భూములు కొంటె స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news