టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రెండు నెలల క్రితం స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వెళ్లగా, ఈ మధ్యనే మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. కాగా చంద్రబాబు రిమాండ్ లో ఉన్న సమయంలో టీడీపీ నేతలు, సినీ నటులు మరియు చంద్రబాబు మద్దతుదారులు ప్రభుత్వాన్ని, జగన్ ను, ఆఖరికి జడ్జి లను సైతం విమర్శించారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్నకు సిఐడి నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన సమయంలో జడ్జి పై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్నకు హై కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగానే సిఐడి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చట్టాలను, న్యాయస్థానాలను మరియు వారిచ్చే తీర్పులను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గౌరవించక తప్పదు.
మనకు అనుకూలమైన వారికి అనుకూలంగా తీర్పిస్తే కరెక్ట్ అని, ప్రతికూలంగా తీర్పు వస్తే వారు తప్పు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం అనిపిస్తుంది. అందుకే న్యాయస్థానాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారికి శిక్ష పడితేనే ముందు ముందు ఇలాంటివి జరగకుండా ఉంటాయి.