బ్రేకింగ్ : దివంగత దాసరి నారాయణరావు ఇంటికి నోటీసులు

-

స్వర్గీయ టాలీవుడ్ సినీ దర్శకులు దాసరి నారాయణ రావు కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. స్వర్గీయ దర్శకులు దాసరి నారాయణ రావు ఇంటి కి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేశారు. ఆర్డర్ 34, రూల్స్ & SOFCPC.RW.SEC 151 CPC క్రింద ఆర్డర్ కింద దాసరి నారాయణ రావు ఇంటి కి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను దాసరి ప్రభు మరియు దాసరి అరుణ్ ల కు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు.

వ్యాపార లావాదే వీ ల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం 2 కోట్ల 11 లక్షల రూపాయలు దాసరి ప్రబు & దాసరి అరుణ్ తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడం లో దాసరి ప్రభు మరియు దాసరి అరుణ్ జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమ శేఖర్ అనే బాధితుడు సిటీ సివిల్ కోర్టు కోర్టు ను ఆశ్రఇంచారు. ఈ నేపథ్యంలోనే దాసరి నారాయణ రావు ఇంటి కి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేశారు. 2 కోట్ల 11 లక్షల రూపాయలు పిటిషనర్ సోమ శేఖర్ రావు కి చెలించాలని సిటీ సివిల్ కోర్టు నోటీసుల్లో పేర్కొంది. చెల్లించాలసిన డబ్బులు రెండు వారాలు అంటే 15/11/2021 వరకు ఇచ్చేయాలని నోటీసుల్లో వెల్లడించింది కోర్టు..

Read more RELATED
Recommended to you

Latest news