RT70 : “టైగర్ నాగేశ్వరరావు” గా రవితేజ.. దుమ్ము లేచిపోవాల్సిందే !

-

టాలీవుడ్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ… క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత రవితేజ అ వరుసగా ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు.  ఇప్పటికే రమేష్‌ వర్మ దర్శకత్వం లో చేస్తున్న ఖిలాబీ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. ప్రస్తుతం షూటింగ్‌ దశ లో రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా సినిమాలున్నాయి. ఈ నేపథ్యం లోనే రవితేజ కెరీర్‌ లో 70 వ సినిమా కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ సినిమాకు “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది. ఇక ఈ పోస్టర్ లో రవితేజ ఊర మాస్ లుక్ లో కనిపించారు. ఆ పోస్టర్ చూస్తుంటే.. సినిమా మొత్తం.. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లాగా మనకు కనిపిస్తుంది.

ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ్, కన్నడ మరియు మలయాలం అలాగే హిందీలోనూ విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా… వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా లో క్యారెక్టర్లను త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం. ఇక అప్డేట్‌ తో రవితేజ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news