ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఘర్షణలు..కృష్ణా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

-

ఏపీలో పరిషత్ ఎన్నికల పొలింగ్ పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.ఓ వైపు ఈ ఎన్నికలను బహిష్కరించినట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించినా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చాలాచోట్ల టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా నందిగామ వీరులపాడులో వైసీపీ-టీడీపీమధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందర్నీ చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ప్రకాశం జిల్లాలోను పరిషత్ ఎన్నికల పొలింగ్ హీట్ పుట్టిస్తోంది. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ల దగ్గర నుంచి ఓటరు స్లిప్పులు లాక్కోవడం వివాదానికి దారితీసింది. ప్రకాశం జిల్లా కొండెపి మండలం పెట్లూరులో గల 41 /6 పోలింగ్‌ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓటు వేయడానికి బూత్‌కు వచ్చిన వాళ్ల దగ్గర నుంచి అక్కడనున్న వాలంటీర్‌ ఓటరు స్లిప్పులు లాక్కున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకి దిగారు. విధుల్లో ఉన్న పోలీసులు వాళ్లను చెదరగొట్టారు.

విజయనగరం జిల్లా కోటియా గ్రామాల్లో పరిషత్ ఎన్నికలు ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. కొఠియా గ్రామాల్లో పరిషత్‌ ఎన్నికలను అడ్డుకునేందుకు ఒడిశా అధికారులు ప్రయత్నించారు. కరోనా ఆంక్షల పేరుతో ఓటర్లు.. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా రోడ్లకు అడ్డంగా రాళ్లు పెట్టారు. దీంతో ఏపీ అధికారులు ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరిపి ఏడు గ్రామాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news