ఈ వేసవిలో మీ అందాన్ని కాపాడే అద్భుతమైన ఇంటి చిట్కాలు..

-

ఇంట్లో కూర్చున్నా ఉక్కపోతగా ఉంటుందంటే అది చర్మ సమస్యలకి దారి తీయవచ్చు. ఇక బయటకెళ్తే అంతే సంగతులు. అందుకే మీ చర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ముఖ్యంగా బయటకి వెళ్ళినపుడు సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ. ఐతే ఏ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలనే దానిపై చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీ చర్మ రకానికి ఏది సరైనది అనిపిస్తుందో అది వాడడమే మంచిది. చర్మం ఊరికే పొడిబారుతుంటే తేమగా ఉంచే సన్ స్క్రీన్ వాడాలి. జిడ్డు చర్మం అయితే గనక కాంబినేషన్ సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. కేవలం ముఖానికే కాకుండా బట్టలతో కవర్ కాని ప్రతీ చోటా సన్ స్క్రీన్ మర్దన చేసుకోవాలి.

వేసవిలో వచ్చే చర్మ సమస్యలకు కావాల్సిన ఇంటి చిట్కాలు

చెమటకాయ

చెమట గ్రంధులు మూసుకుపోవడం వల్ల చెమటకాయలు ఏర్పడతాయి. వీటి బారి నుండి బయటపడాలంటే సింథటిక్ బట్టలు వేసుకోకుండా ఉండాలి. కాటన్ బట్టలు మాత్రమే వాడి, లూజ్ గా ఉండేట్లు చూసుకోవాలి. కలబంద, పసుపు మొదలగు వాటితో చర్మాన్ని మర్దన చేసుకుంటే బాగుంటుంది.

ఎండ వేడి

కొంత మందికి కొద్దిసేపు ఎండలో తిరిగినా అదోలాటి భావన కలుగుతుంది. మొత్తం శక్తినంతా ఎవరో లాగేసినట్టు అవుతుంది. అదీగాక ఎండవల్ల చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి వారు బేకింగ్ సోడాని నీళ్ళలో కలుపుకుని దానితో ముఖాన్ని నానెబెట్టుకుంటే బాగుంటుంది.

చర్మం ఊడిపోవడం

ఎండవల్ల ఎక్కువగా పాడైన చర్మం ఊడిపోయే పరిస్థితికి రావచ్చు. ఇది చాలా నొప్పితో కూడుకున్నటువంటిది. అప్పుడు, చల్లని నీటిలో కాటన్ బట్టని ముంచి చర్మంపై మర్ద చేయాలి. కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

చర్మం దళసరిగా మారడం

చర్మం దళసరిగా మారుతుంతే గనక పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. దీనివల్ల వయసు పెరుగుతున్నటటు ముడుతలు వచ్చేస్తాయి. అందుకని, కాక్టస్ క్రీమ్ వాడడం బెటర్. కోల్డ్ క్రీమ్ వాడినా ఫలితం ఉంటుంది. దాన్ని చర్మానికి మర్దన చేసుకుని పదిహేను నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత కొద్ది సేపటికి ముఖం కడుక్కుని టవల్ తో పొడిగా చేసుకుంటే చాలు.

Read more RELATED
Recommended to you

Latest news