చంద్రబాబు కీలక నిర్ణయం.. పవన్ కి మరో గుడ్ న్యూస్..?

-

టీడీపీ కూటమి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో సీఎంగా చంద్రబాబు మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. ఇక ఏపీని అభివృద్ధి దిశగా నడిపించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది.

ఈ ఎన్నికల ఫలితాల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈక్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక పదవులు (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ) కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, అలాగే ఆఫీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఉండాలని ఆదేశించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news