ఈ నెల 11, 12 తేదీల్లో జగన్‌ తిరుమల పర్యటన

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే సోమ, మంగళవారాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు… సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. తన పర్యటన లో శ్రీవారిని కూడా దర్శించుకుంటారు సీఎం జగన్‌. 11వ తేదీ తాడేపల్లి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.

తిరుపతిలో బర్డ్‌ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు… పైకప్పుతో కొత్ తగా నిర్మితమైన అలిపిరి మెట్ల మార్గాన్ని, పాదాల మండపం వద్ద కొత్తగా నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. ఇక 12 వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అనంతరం టీటీడీ రైతు సాధికా రక సంస్థ ఎంఓయూ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు. ఇక ఈ పర్యటన పూర్తి అయ్యాక.. రేణిగుంట విమాన శ్రయం నుంచి తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.