ఐసిస్ లక్ష్యంగా తాలిబన్ల దాడులు

ఆప్గన్ ను చేజిక్కిచ్చుకున్న తర్వాత తాలిబన్లకు ఐసిస్ రూపంలో కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. వరసగా దాడుల చేస్తూ ఐసిస్ ఉగ్రవాదులు తాలిబన్లకు సవాల్ విసురుతున్నారు. గత ఆగస్ట్ లో పౌర ప్రభుత్వం నుంచి అధికారాన్ని వశపరుచుకున్న తర్వాత ఐసిస్ ఉగ్రవాదులు వరసగా దాడులు చేస్తున్నారు. 

గతంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడిలో పలువురు సామాన్యులతో పాటు అమెరికన్ సైనికులు మరణించారు. తాజాగా కుందుజ్ లో మసీదుపై ఐసిస్ దాడిలో 100పైగా మరణించారు. తాజాగా ఐసిస్ పై ఉక్కుపాదం మోపే దిశగా తాలిబన్లు దాడులు నిర్వహిస్తున్నారు. ఆప్గన్ లో ఐసిస్ ను అణచివేస్తామని ప్రకటించారు. ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా తాలిబన్లు దాడులు నిర్వహిస్తున్నారు. కాబూల్ సమీపంలో ముగ్గురు ఐసీస్ తీవ్రవాదులను హతమార్చినట్లు తాలిబన్లు ప్రకటించారు.