జగన్ కేసులో వాదనలు పూర్తి.. తీర్పుపై ట్విస్ట్‌..

ఏపీ ముఖ్యమంత్రిగా తాను చాలా బిజీగా ఉన్నానని… ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం తనకు సాధ్యం కాదని.. అందువల్ల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. అలాగే సీబీఐ తరఫు లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు నవంబర్ 1వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు వాదనలు జరుగుతున్న సమయంలో జగన్ తరపు లాయర్ జగన్ ను ఉద్దేశించి సీబీఐ న్యాయవాది వాడుతున్న భాష సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని గౌరవనీయ ముఖ్యమంత్రి అని సంబోధించాలని సూచించారు.