ఏపీ హాస్టల్ విద్యార్థులకు సిఎం జగన్ శుభవార్త చెప్పారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు – నేడు కింద పనులు చేయాలని.. స్కూళ్ల నిర్వహణా నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
హాస్టళ్లలో తప్పనిసరిగా వైద్యుల సందర్శన అని.. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలన్నారు. దీనిపై ప్రతి పాదనలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు జగన్. అనంతరం చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతులు పై సీఎం జగన్ సర్వే నిర్వహించారు.. హాస్టళ్లలో పిల్లలకు పౌష్టికాహారం అందే విషయం పైనా సీఎం జగన్ సమీక్షించారన్నారు.
అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని.. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని సీఎం ఆదేశించారని వివరించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం మెను ను మెరుగుపరచాలి అన్నారు.. మూడువేల హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించారని తెలిపారు.