ఇవాళ సీఎం వైయస్ జగన్ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమాన్ని బటన్ నొక్కి విడుదల చేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. 10.10 గంటలకు బాపట్ల చేరుకోనున్నారు.
ఇక ఇవాళ ఉదయం 10.35 – 12.10 గంటల వరకు బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం జగనన్న విద్యాదీవెన కార్యక్రమం నిధులను విడుదల చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్. కాగా..
సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు ఇవాళ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు – నేడు కింద పనులు చేయాలని.. స్కూళ్ల నిర్వహణా నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేశారు. హాస్టళ్లలో తప్పనిసరిగా వైద్యుల సందర్శన, హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలన్న సీఎం.. ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.