కొత్తగా పెళ్లైన జంటలకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..

-

కొత్తగా పెళ్లి అయిన జంటలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఏపీ లో కొత్తగా వివాహం చేసుకుని అత్త గారి ఇంటికి వెళ్లిన వారు పేర్లు నమోదు చేయడంలో సమస్యలు ఎదురయ్యాయి. అత్తారింటికి చెందిన కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునే అవకాశం గ్రామ సచివాలయం లో అందుబాటులో ఉంటుంది.

ఎవరైనా కొత్తగా పేరు నమోదు చేయించుకోవాలంటే సంబంధిత వ్యక్తి వేలిముద్రలు నమోదు చేస్తారు. వివరాలను సచివాలయాల్లో నమోదు చేసిన తర్వాత ఎంపీడీవో మరియు మున్సిపల్ కమిషనర్ ఆమోదిస్తారు. అనంతరం వారి పేర్లు కుటుంబం లో సభ్యులుగా నమోదు అవుతాయి.

వాలంటీర్లు కుటుంబ సభ్యులుగా పేరు నమోదు చేసిన తర్వాత రేషన్ కార్డులో పేరు చేరుస్తారు. కొత్తగా పేరు నమోదు చేయించుకోవడం తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి కూడా వీలు ఉంటుంది. గతంలో వివాహం అనంతరం అత్తారింట్లో నమోదు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదు. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అనే పేర్లను నమోదు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news