అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్‌రెడ్డి వచ్చే వారం బిజీ షెడ్యూల్ లో ఉండనున్నారు. ఈ నెల ఏడవ తేదీన అంటే ఎల్లుండి హైదరాబాద్ కు రానున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. ఎల్లుండి ముచ్చింతల్ చిన జీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సావాల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. అనంతరం.. తిరిగి సాయంత్రం… తాడే పల్లి గూడెనాకి వెళ్లనున్నారు.
ఇక ఈ టూర్ అనంతరం.. ఈ నెల 9న విశాఖకు సీఎం వైయస్ జగన్ వెళ్లనున్నారు. చిన ముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవంలో ఈ సందర్భంగా పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి. అనంతరం.. ఈ నెల 11 న మరోసారి హైదరాబాద్ వెళ్ళనున్నారు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి. మంత్రి బొత్స సత్య నారాయణ కుమారుడి వివాహ వేడుక హైదరాబాద్ లో జరుగనుంది. ఈ నేపథ్యంలోనే… హైదరాబాద్ రానున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు వైఎస్ భారతి కూడా హైదరాబాద్ రానున్నారు. ఈ వివాహ కార్యక్రమం అనంతరం.. తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.