కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే..ఆయన ఏదో దేశ రాజకీయాలని తనవైపుకు తిప్పుకునేలా చేయాలని చెప్పి ఏకంగా రాజ్యాంగం మార్చాలని కామెంట్ చేశారు..అయితే దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి..అంబేడ్కర్‌ని కేసీఆర్ అవమానించారని, కేసీఆర్ నియంత పాలనకు ఇదొక ఉదాహరణ అంటూ ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి.
ఈ పరిస్తితుల నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడినా మాటలు..ఇప్పుడు టీఆర్ఎస్‌కు బాగా ఇబ్బందిగా మారాయి. అయితే కేసీఆర్ వ్యాఖ్యలని కవర్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు కేసీఆర్ మాటలని సమర్థిస్తూనే…మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం…కేసీఆర్ వ్యాఖ్యలని కవర్ చేయడానికి చూశారు.
అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని, అలా సవరిస్తే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించినట్లా? అని ప్రశ్నించారు. అలాగే ఎన్డీయే హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2001లో రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక కమిటీని వేశారని, మరి అప్పుడు వాజ్‌పేయి రాజ్యాంగాన్ని అవమానపరిచి నట్లా? అని చెప్పి ప్రశ్నించారు. ఇలా రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ఉదాహరణలని కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు.
అయితే కేసీఆర్ అన్నది రాజ్యాంగం మార్చాలని…రాజ్యాంగ సవరణలు అంటే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు…కానీ కేసీఆర్ రాజ్యాంగం మార్చేయాలని మాట్లాడారు. అందుకే నిరసనలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కేటీఆర్ కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత ట్రై చేసిన ఉపయోగం లేదనే చెప్పాలి..ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యల వల్ల దళితుల్లో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలో ఎంత కవర్ చేసిన ఉపయోగం లేదనే చెప్పాలి.