వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్ : తరలి రానున్న పెట్టుబడులు !

విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో వాణిజ్య ఉత్సవం- 2021 ను కాసేపటి క్రితమే ప్రారంభించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రెండు రోజుల పాటు ఘనంగా వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా ఈ వాణిజ్య ఉత్సవాన్ని నిర్వహిస్తోంది ఏపీ సర్కార్‌.

jagan
jagan

ఈ నేపథ్యం లో వాణిజ్య ఉత్సవం 2021 కు దేశ విదేశాల ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. రెండు రోజుల పాటు జరిగే వాణిజ్య ఉత్సవం లో పారిశ్రామిక ప్రగ తి పై పలు సెమినార్లు నిర్వహించనుంది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వాణిజ్య ఉత్సవం కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో అనేక రకాల పెట్టుబడులు, పారిశ్రామిక కంపెనీలు వస్తాయని జగన్‌ సర్కార్‌ యోచిస్తోంది.