జగన్ మరో కీలక నిర్ణయం : 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం !

ట్రైబల్‌ ప్రాంతాల్లో దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తామని… సమగ్రంగా ఇంటర్నెట్, మొబైల్‌ టెలికాం సౌకర్యం ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ట్రైబల్‌ యూనివర్శిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని… గిరిజనుల్లో చాలామంది పిల్లలకు ఆధార్‌ లేదన్నారు.

jagan

ట్రైబల్‌ ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్‌ సెంటర్లుగా గుర్తించేలా కేంద్రాన్ని కోరాలని ఆదేశించారు సీఎం జగన్ గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని… ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసా కూడా ఇస్తున్నామన్నారు. ప్రతి ఏటా రూ.13,500 గిరిజన రైతుల చేతిలో పెడుతున్నామని… ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో గిరిజనులకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు. 31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగాయని… నాడు – నేడు కార్యక్రమాలకు తగిన సహకారం అందించాలని కేంద్రాన్ని కోరాలని తెలిపారు.