ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇవాళ సాయంత్రంలోగా.. పీఆర్సీ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. కాసేపటి క్రితమే… ఉద్యోగ సంఘాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది.
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్నారు. అనంతరం పీఆర్సీ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేసే చాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పిలుపు రావడంతో… సమావేశానికి వెళ్లేందుకు ఏపీ ఉద్యోగులు సన్నద్ధం అవుతున్నారు.అయితే… 34 శాతం పీఆర్సీని సీఎం జగన్ ప్రకటిస్తారా.. లేదా ఇంకా తగ్గిస్తారా అనేది తెలియాల్సి ఉంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి… తమకు న్యాయమైన పీఆర్సీని ప్రకటిస్తారని అటు ఉద్యోగులు చెబుతున్నారు.