అత్యధిక పాలనిచ్చే ముర్రా బఫెలో గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!

-

దక్షిణ భారత దేశ వాతావరణ పరిస్థితులకు ముర్రా బఫెలో అనుగుణంగా ఉంటాయి. అలానే ఈ గేదెలు వ్యాధులన్నీ తట్టుకోగలవు. రోజుకి 10 లీటర్లు నుంచి 16 లీటర్ల వరకూ దిగుబడి ఉంటుంది. అయితే వీటిలో 16 లీటర్లు కంటే ఎక్కువ కూడా ఇచ్చేవి ఉంటాయి కానీ ధర ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ముర్రా గేదెల ధర గురించి చూస్తే.. వీటి ధర 60 వేల నుంచి లక్ష 30 వేల వరకు ఉంటుంది.

ఈ గేదె యొక్క శరీరం బాగా నిర్మించబడి ఉంటుంది. భారీ ఆకారంలో ఇది ఉంటుంది. వీటి రంగు జెట్ బ్లాక్ రంగులో ఉంటాయి. వీటి కొమ్మలు కూడా సాధారణ గేదెల కంటే భిన్నంగా ఉంటాయి. శరీరం ఐదు వందల యాభై కిలోల నుండి ఉంటుంది. ఆడ గేది అయితే 450 కిలోలు ఉంటుంది వీటిని కనుక రైతులు కొనుగోలు చేసి పెంచితే చక్కగా రాబడి వస్తుంది.

వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ఏది ఏమైనా దక్షిణ భారత వాతావరణానికి ఇవి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ముర్రా గేదె యొక్క సగటు వయసు 11 నుండి 12 సంవత్సరాలు ఉంటుంది.

ఈ గేదెల గర్భధారణ కాలం 310 రోజులు. వీటి పాలలో కొవ్వు శాతం 6.5 నుండి తొమ్మిది శాతం వరకు ఉంటుంది. ఇవి నిశబ్ద వేడిని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తించడానికి శ్రద్ధ వహించాలి. ఇలా వీటిని పెంచితే మంచి రాబడిని ఇవి తీసుకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news