ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ, రేపురెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్ సమ్మిట్ సమావేశాలకు సీఎం జగన్ హాజరు కావడంతో పాటు.. కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరగనున్న జి – 20 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
షెడ్యూల్
ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్..ఏడు గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. రేపు ఉదయం పదిన్నర గంటలకు లీలా ప్యాలెస్ హోటల్ కు సీఎం జగన్.. పలు దేశాల రాయబారులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర వరకు కొనసాగనున్న రాయబారులతో సీఎం జగన్ సమావేశం జరుగనుంది. సమావేశం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు ముఖ్యమంత్రి రానున్నారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు సీఎం జగన్.