బ్రేకింగ్: చంద్రబాబుకి తన మార్క్ కౌంటర్ ఇచ్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వాక్సిన్ కి సంబంధించి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అధికార పార్టీ నేతలు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం చంద్రబాబు కూడా వాటిపై ఘాటుగా స్పందించడం మనం చూసాం. ఇక ఏపీలో కరోనా వేరియంట్ కి సంబంధించి కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా స్పందన కాన్ఫరెన్స్ లో భాగంగా సిఎం జగన్ చంద్రబాబు నాయుడు కి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజల్లో దుష్ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వాక్సిన్ పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికి తెలుసు అని సిఎం జగన్ అన్నారు.