కోవిడ్ –19 పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా ఉన్నాయని అధికారులు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సిఎం జగన్… కావాలనే కొన్ని పత్రికలు విషపూరిత రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు.
కోవిడ్ ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాలపై వివరాలు అందించారు అధికారులు. మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ లో 9,971 పోస్టులు భర్తీ చేస్తారు. అందులో 4,676 పోస్టులు నియామకం చేయనున్నారు. 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుంది. మరో 10 రోజుల్లో ఈ పోస్టుల భర్తీ పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. కోవిడ్‌కోసం ప్రస్తుతం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.